Cm Jagan Counter To Opposition On volunteer Issue
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ( Ys Jagan Mohan Reddy ) సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రామ వాలంటీర్ ( Volunteer ) వ్యవస్థపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు.
గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీర్ వ్యవస్థ చుట్టూ తిరుగుతున్నాయి. వాలంటీర్లను వైసీపీ ( YCP ) తమ పార్టీ పనులకు ఉపయోగించుకుంటుందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూన్నాయి.
కాగా కొద్దీ రోజుల క్రితం వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) సంచలన ఆరోపణలు చేశారు. వాలంటీర్లు ప్రజల డేటా ( Data )ను చోరీ చేస్తున్నారని, రాష్ట్రంలో మహిళల ట్రాఫికింగ్ ( Trafficking ) లో వాలంటీర్ ల పాత్ర ఉందని పవన్ ఆరోపణలు చేశారు.
పవన్ వ్యాఖ్యలను వైసీపీ తప్పుబట్టింది. పవన్ కు వ్యతిరేకంగా వైసీపీ నాయకుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు. అప్పటి నుండి రాష్ట్రంలో వాలంటీర్ల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి.
టీడీపీ ( Tdp ), జనసేన ( Janasena ) నాయకులు వాలంటీర్ల పై చేస్తున్న వ్యాఖ్యలకు సీఎం జగన్ ఈరోజు కౌంటర్ ఇచ్చారు.
ఇవాళ తిరుపతి ( Tirupathi ) వెంకటగిరిలో నేతన్న నేస్తం నిధుల జమ కార్యక్రమంలో జగన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రసంగిస్తూ టీడీపీ, జనసేన పార్టీల పై విరుచుకుపడ్డారు.
వాలంటీర్లు రాష్ట్రంలోని ప్రతి గడపకు సేవలందిస్తున్నారు. కులం, మతం, పార్టీ ( Party ) అని వివక్ష చూపకుండా ప్రజలందరికీ సేవ చేస్తున్న మంచి వారు వాలంటీర్లు అని సీఎం జగన్ తెలిపారు.
ఎండా, వాన, వరదలను లెక్క చేయకుండా పని చేస్తున్న వాలంటీర్ల పై ప్రతిపక్షాలు అన్యాయంగా బురదజల్లుతున్నారని సీఎం జగన్ ఉద్ఘాటించారు.
సంస్కారం ఉన్న ఏ ఒక్కరు వాలంటీర్లను అవమానించరని సీఎం అన్నారు.
వాలంటీర్లు మహిళలను ట్రాఫికింగ్ చేస్తున్నారని ఒకరంటున్నారని కానీ వాలంటీర్లలో 60 శాతం మహిళలే ఉన్నారని సీఎం జగన్ తెలిపారు.
Cm Jagan Fires On Opposition| ఈ సందర్బంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్, సినీ నటుడు, హిందూపూర్ ( Hindupur ) ఎమ్మెల్యే బాలకృష్ణ, టీడీపీ నాయకుడు లోకేష్ లను ఉద్దేశించి వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ సంధర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ ” చంద్రబాబు నాయుడు, ఆయన దత్తపుత్రుడు, సొంత పుత్రుడు, బావమరిది క్యారెక్టర్ ( Character ) ఎలాంటిదో అందరికి తెలుసు ” అని సీఎం జగన్ అన్నారు.
యూట్యూబ్ ( Youtube ) లో చూస్తే “ఒకరు మందు తాగుతూ స్విమ్మింగ్ పూల్ ( Swimming Pool ) లో అమ్మాయిలతో ఒకరు, అమ్మాయి కనిపిస్తే ముద్దైన పెట్టాలి, కడుపైన చేయాలని ఒకడంటాడు” అని లోకేష్, బాలకృష్ణ లపై సీఎం జగన్ విమర్శలు గుప్పించారు.
” టీవీ షో ( Tv Show ) కి వెళ్లి బావ నువ్వు సినిమాల్లోనే చేశావు.. నేను నిజంగా చేశాను..” అని చంద్రబాబు ఒక టీవీ షో చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ సీఎం జగన్ ఎద్దవా చేశారు.
Ys Jagan Sensational Comments On Janasenani| ” అమ్మాయిలని లోబర్చుకోవడం, పెళ్లిల్లు చేసుకోవడం, కాపురాలు చేయడం, వదిలేయడం ఇది పవన్ కళ్యాన్ క్యారెక్టర్ ” అని సీఎం జగన్ తీవ్ర స్థాయిలో పవన్ పై రెచ్చిపోయారు.
” ఇటువంటి వ్యక్తి వాలంటీర్లను విమర్శిస్తాడా ?” అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు. పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్ గా పనిచేస్తున్న ప్యాకేజి స్టార్ పవన్ కళ్యాణ్ అని సీఎం ఆరోపించారు.
గ్రామాల్లో నిత్యం సేవాలుచేస్తున్న వాలంటీర్లు ఎటువంటి వారో రాష్ట్ర ప్రజలకు తెలుసని జగన్ పేర్కొన్నారు.