Cm Chandrababu On Jamili Elections | ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని ఎన్డీయే ( NDA ) ప్రభుత్వం జమిలి ఎన్నికలకు సంబంధించి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి.
ఇదే జరిగితే 2027లోనే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయి అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు స్పందించారు. జమిలి ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు.
2027లో జమిలి ఎన్నికలు వస్తున్నాయని, మళ్ళీ వైసీపీ తిరిగి అధికారాన్ని కైవసం చేసుకుంటుందని జగన్ పార్టీ నాయకులు అంటున్నారు. ఇదే విషయంపై సీఎం స్పందిస్తూ జమిలి ఎన్నికలపై అవగాహన లేని వైసీపీ నాయకులు ఎదిపడితే అదే మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానానికి ఎప్పుడో మద్దతు ఇచ్చినట్లు చంద్రబాబు పేర్కొన్నారు.