Cm Chandrababu Meets Bill Gates | మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులు బిల్ గేట్స్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ భేటీలో వివిధ అంశాలపై ఇరువురు చర్చించుకున్నారు.
ప్రముఖంగా విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఏపీకి సహకారం అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఉపాధి కల్పన, వ్యవసాయం, ఆరోగ్యం, విద్య వంటి రంగాల్లో సేవలను మరింత వేగంగా అందించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వినియోగం పై చర్చించినట్లు సీఎం పేర్కొన్నారు.
స్వర్ణ ఆంధ్రప్రదేశ్-2047 లక్ష్యం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఇందులో భాగంగా గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యం కీలకంగా మారుతుందని సీఎం వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ పురోగతి కోసం సమయాన్ని కేటాయించిన బిల్ గేట్స్ కు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ధన్యవాదాలు చెప్పారు.