CID arrested Hyderabad Cricket Association president Jagan Mohan Rao | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ బుధవారం అరెస్ట్ చేసింది.
ఆయనతో పాటు మరొకరిని కూడా అదుపులోకి తీసుకుంది. గత ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్-హెచ్సీఏ మధ్య వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. ఈ వివాదం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆయన విజిలెన్స్ విచారణకు ఆదేశించారు.
విజిలెన్స్ నివేదిక ఆధారంగా తాజగా సీఐడీ ఎఫ్ఐఆర్ ను నమోదు చేసి జగన్మోహన్ రావును అరెస్ట్ చేసింది. ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టికెట్స్ కేటాయించలేదని కార్పొరేట్ బాక్స్ కు హెచ్సీఏ తాళం వేసింది. ఈ ఘటనతో హైదరాబాద్ వదిలి పోతామని SRH యాజమాన్యం స్పష్టం చేసింది.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన విజిలెన్స్ HCA ప్రెసిడెంట్ SRH ఫ్రాంచేజ్ పై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు నిర్ధారించింది. టికెట్ల కోసం SRH యజమాన్యం ని ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణలో తేలింది. SRH యాజమాన్యం 10 శాతం టికెట్ల ను HCA కు ఫ్రీగా ఇస్తున్నా, మరో 10 శాతం టికెట్లు కావాలని యాజమాన్యంపై జగన్మోహన్ రావు ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ నివేదికలో పేర్కొంది.
SRH టికెట్లు ఇవ్వకపోవడంతో మ్యాచ్ల సందర్భంగా జగన్మోహన్ రావు ఇబ్బందుల గురిచేసినట్లు, లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపి గ్యాలరీలకు హెచ్సీఏ సిబ్బంది తాళాలు వేసినట్లు విజిలెన్స్ విచారణలో భాగంగా స్పష్టం అయ్యింది. ఈ నేపథ్యంలో HCA పై చర్యలకు విజిలెన్స్ సిఫారసు చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీఐడీ కేసు నమోదు చేసింది.