Chiranjeevi Update on Mark Shankar Health | ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Shankar) సింగపూర్ లోని ఓ స్కూళ్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే.
ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ నిన్న(బుధవారం) తన కుమారుడు చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి.. మార్క్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవి (Chiranjeevi).. మార్క్ శంకర్ ఆరోగ్యంపై అప్ డేట్ ఇచ్చారు.
“మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంగా ఉంటాడు. ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు.
ఈ సందర్భంగా పలు గ్రామాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని పలువురు ప్రార్థనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందచేస్తున్నారు. నా తరపున, తమ్ముడు కల్యాణ్ తరపున అందరికీ ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.