Monday 16th March 2026
12:07:03 PM
Home > సినిమా > అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా.. హీరోయిన్ గా చెన్నై బ్యూటీ!

అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ తో చిరంజీవి సినిమా.. హీరోయిన్ గా చెన్నై బ్యూటీ!

Chiranjeevi

Chiranjeevi Next Movie | టాలీవుడ్ బాస్, మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వాల్తేరు వీరయ్యతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో ఈ ఆగస్టుకు సిద్ధమతున్నారు. భోళా శంకర్ సినిమా ఆగస్ట్ 11న విడుదలవుతోంది.

తమిళ్ లో సూపర్ హిట్ అయిన వేదాళం ను మెహర్ రమేష్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటిస్తోంది. చిరుకు జోడిగీ మిల్కీ బ్యూటీ తమన్నా చిందులు వేయనుంది.

ఇదిలా ఉండగా చిరంజీవి తదుపరి సినిమాకు సంబంధించి సినీ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇద్దరు యువ దర్శకులు రూపొందించిన స్క్రిప్ట్‌ లను మెగాస్టార్ ఆమోదించినట్లు ఫిల్మ్ సర్కిల్స్‌ లో వార్త హల్‌చల్ చేస్తోంది.

మరోవైపు చిరు నెక్ట్స్ మూవీ కోసం ఆల్రెడీ డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకున్నాడని కొన్ని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఫిల్మ్ సర్కిళ్లలో వినిపిస్తున్న వార్తల ప్రకారం, మెగాస్టార్ తన తదుపరి సినిమా కోసం అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

అదేంటి అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ ఎవరూ అనుకుంటున్నారా.. నాగార్జున, నాగచైతన్యలతో సినిమాలు చేసిన కళ్యాణ్ కృష్ణ. ఈ దర్శకుడు అక్కినేని ఫ్యామిలీలో నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు సినిమాలను రూపొందించాడు.

ఇక నాగ చైతన్యతో రారండోయ్ సినిమా తీశాడు. ఈ మూడు చిత్రాలు హిట్ కావడంతో కళ్యాణ్ కృష్ణను అక్కినేని ఫ్యామిలీ డైరెక్టర్ అని పిలుస్తున్నారట.   కళ్యాణ్ కృష్ణ చెప్పిన స్క్రిప్ట్ ను మెగాస్టార్ ఒకే చేసినట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాను చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మించనున్నారట.

ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే.. చిరంజీవితో కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ హీరోయిన్  గా ఎంపిక చేశారట.

చిరంజీవి సరసన త్రిష.. స్టాలిన్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఆచార్య సినిమాలో నటించాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఆ సినిమా నుంచి త్రిష తప్పుకుంది. ఆ ప్లేస్‌లో కాజల్ వచ్చి చేరింది.

అయితే ఎడిటింగ్‌లో కూడా ఆమె క్యారెక్టర్‌ని కూడా తొలగించారు. ఆ సినిమా ఊహించని డిజాస్టర్ గా నిలిచిపోయింది. అయితే ఇప్పుడు మరోసారి చిరంజీవితో త్రిష జతకట్టనుందనే టాక్ వినిపిస్తోంది. అంతా ఫైన‌లైజ్ అయిన త‌ర్వాత ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని మెగా వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

You may also like
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
konda sushmitha book rudra
మంత్రి కుమార్తె రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి!
lavanya tripathi
‘చిరంజీవి గారి గురించి మీకేం తెలుసు’
chiranjeevi
పద్మ అవార్డు గ్రహీతలకు ‘చిరు’ సన్మానం..!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions