Chiranjeevi Met Paralympic medalist Deepthi Jeevanji | పారిస్ ( Paris ) వేదికగా 2024లో పారలింపిక్స్ జరిగిన విషయం తెల్సిందే.
ఇందులో భాగంగా మహిళల 400 మీటర్ల పరుగు టీ20 విభాగంలో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవన్ జీ కాంస్య పతకం గెలిచారు.
నిరుపేద కుటుంబం నుండి వచ్చినా ప్రతిభతో ప్రపంచ స్థాయి పోటీలో పతకం సాధించిన దీప్తికి తెలంగాణ ప్రభుత్వం నజరణాను ప్రకటించింది. అలాగే ప్రముఖులు ఆమెను అభినందించారు. నటుడు చిరంజీవి కూడా తాజగా ఆమెను కలిసి సత్కరించారు.
ఈ విషయాన్ని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్ వెల్లడించారు. పతకం సాధించిన తర్వాత నీకు ఏమి కావాలని దీప్తిని అడిగితే చిరంజీవిని కలవాలని ఆమె చెప్పినట్లు గోపిచంద్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని మెగాస్టార్ కు తెలియజేయగా తానే స్వయంగా వచ్చి ఆమెను కలుస్తానని మాట ఇచ్చినట్లు చెప్పారు.
తాజగా హైదరాబాద్ లోని గోపిచంద్ ఆకాదేమికి చిరంజీవి వచ్చారు. దీప్తికి పుష్పగుచ్ఛం అందజేశి శాలువతో సన్మానించారు. అనంతరం రూ.3 లక్షల చెక్కును కానుకగా ఇచ్చారు. ప్రతిభను ప్రోత్సహించడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారని, ఎంతోమంది అథ్లెట్స్ కు ఆయన ఆదర్శమని ఈ సందర్భంగా గోపిచంద్ కొనియాడారు.