Chiranjeevi Gifts Luxury Car to Anil Ravipudi | మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడికి అదిరిపోయే బహుమతి ఇచ్చారు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారును దర్శకుడికి కానుకగా ఇచ్చారు. మెగాస్టార్-రావిపూడి కాంబోలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. ఇప్పటికే ఈ మూవీ రూ.350 కోట్లకు పైగా వసూలు చేసింది.
ఈ నేపథ్యంలో తన కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాను తెరక్కెకించిన దర్శకుడు అనిల్ రావిపూడికి రేంజ్ రోవర్ కారును బహుకరించారు చిరు. ఈ క్రమంలో దర్శకుడు సంతోషం వ్యక్తం చేస్తూ మెగాస్టార్ కు ధన్యవాదాలు తెలిపారు. ‘మెగా బహుమతి మహదానందం మనో ధైర్యం.. ధనా ధన్’ అంటూ మెగాస్టార్ కు కృతజ్ఞతలు తెలియజేశారు అనిల్ రావిపూడి.









