Monday 16th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > CSK vs RCB..ధోని రివేంజ్ తీర్చుకుంటాడా?

CSK vs RCB..ధోని రివేంజ్ తీర్చుకుంటాడా?

Chennai Super Kings vs Royal Challengers Bengaluru | ఐపీఎల్-2025లో భాగంగా శుక్రవారం సాయంత్రం రెండు పెద్ద జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. చెన్నైలోనో చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి.

ఓ వైపు ఎంఎస్ ధోని, మరో వైపు విరాట్ కోహ్లీ తలపడనుండడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా 2024లో చెన్నైను ఓడించి ఆర్సీబీ ప్లేఆఫ్స్ కు వెళ్ళింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో గతేడాది జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో చెన్నై 18 పరుగులు చేస్తే ప్లేఆప్స్ కు వెళ్ళేది. కానీ, చివరి ఓవర్ వేసిన యశ్ దయాల్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.

అలాగే ధోని వికెట్ కూడా తీశాడు. ఈ సందర్భంగా జరిగిన ఓ ఘటన అప్పట్లో కాస్త వివాదానికి దారి తీసింది. ప్లేఆప్స్ కు చేరిన నేపథ్యంలో బెంగళూరు ఆటగాళ్లు సంబరాల్లో మ్యూనిగితేలారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్లకు షేక్ హాండ్ ఇచ్చేందుకు ధోని కాసేపు ఎదురుచూశాడు. కానీ ఆర్సీబీ ప్లేయర్లు రాకపోవడంతో ఆయన డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్ళిపోయాడు.

ఆ సమయంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉండగా చెపాక్ స్టేడియంలో గత 17 ఏళ్లలో ఆర్సీబీ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. మొత్తంగా ఈ రెండు టీంలు 33 సార్లు తలపడగా చెన్నై ఏకంగా 21 సార్లు, ఆర్సీబీ కేవలం 11 మ్యాచుల్లో గెలవగా ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు.

ఈ క్రమంలో శుక్రవారం జరిగే మ్యాచ్ లో గతేడాది ఓటమికి చెన్నై రివెంజ్ తీర్చుకుంటుందని సీఎస్కె ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. చెపాక్ లో సీఎస్కె ను ఓడించి ఆర్సీబీ విజయ దుందుభి మోగించడం గ్యారంటీ అంటూ బెంగళూరు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
ipl 2026 update
IPL 2026: పంజాబ్ తో కాదు.. ఆర్సీబీ తొలి సమరం ఏ జట్టుతో అంటే!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions