chaos in congress over revanth comments
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్నాయి.
ఇప్పటికే బీఆరెఎస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. నేడు, రేపు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు బీఆరెఎస్ పార్టీ పిలుపునిచ్చింది.
మరోవైపు ఇప్పుడిప్పుడే ఇకమత్యాన్ని ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో పార్టీ నాయకత్వం చిలిపోయింది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సొంత పార్టీలోనే వ్యతిరేకత మొదలయ్యింది. భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారు..!
రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం, పార్టీకి ఎటువంటి సంబంధం లేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు.రేవంత్ తను చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కోరారు.
అలాగే ఉచిత విద్యుత్ విశిష్టత రేవంత్ కు తెలీదని ఎద్దేవా చేశారు. 2004 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేకర్ రెడ్డి సోనియాగాంధీ ని ఒప్పించి ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రారంభించాం అని తెలిపారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి మేము చాలా కష్టపడ్డాం , కానీ అప్పుడు రేవంత్ కాంగ్రెస్ పార్టీలో లేరు గనుక ఉచిత విద్యుత్ ప్రాముఖ్యత తనకి తెలీదని కోమటిరెడ్డి చెప్పారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలు పట్టిoచుకోవద్దు, రేవంత్ రెడ్డి మాటే ఆఖరి కాదు అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేవలం సమన్వయ కర్తలు మాత్రమే ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో అధిష్టానం చేతిలో ఉంటుందని కోమటిరెడ్డి అన్నారు.
అలాగే బీఆరెఎస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని కోరారు. కాంగ్రెస్ పార్టీ 24 గంటల ఉచిత విద్యుత్ కు కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎవరినైనా సీఎం చేస్తుంది. సీతక్క కూడా సీఎం అయ్యే అవకాశం ఉందని అన్నారు.
దీనిపైన కూడా స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎంను ఎవర్ని చేయాలనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఎస్సి సీఎం అవుతారా ? లేదా ఎస్టీ సీఎం అవుతారా ? అనేది పార్టీ నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
సీతక్క సీఎం అనే అంశం పెద్ద జోక్ అని కొట్టిపడేశారు.