Chandrababu and Revanth Meet in Delhi | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బుధవారం భేటీ అయ్యారు.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో ఈ భేటీ ప్రారంభమయ్యింది. ఈ భేటీలో తెలుగు రాష్ట్రాల మధ్య జల అంశాలను చర్చించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు మరియు తెలంగాణ ప్రతిపాదించిన 10 అంశాలను కేంద్రం అజెండాలో చేర్చింది.
ముఖ్యమంత్రుల వెంట ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిమ్మల రామానాయుడు, ఇరు రాష్ట్రాల సీఎస్ లు మరియు ఇరిగేషన్ శాఖ అధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు.
ఈ భేటీ కంటే ముందు ఢిల్లీలోని అధికారిక నివాసంలో ముఖ్యమంత్రులు సుమారు గంటన్నర సేపు అధికారులతో సమావేశం అయి, భేటీలో లెవనత్తాల్సిన అంశాలపై చర్చించారు.