Sunday 8th September 2024
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > 18 ఓటీటీలపై నిషేధం విధించిన కేంద్రం.. కారణమేంటంటే!

18 ఓటీటీలపై నిషేధం విధించిన కేంద్రం.. కారణమేంటంటే!

union govt banned 18 ott apps

Central govt bans 18 OTT apps | కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన  కంటెంట్‌ను ప్రచురిస్తున్న 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను నిషేధించింది. అశ్లీల కంటెంట్‌ని ప్రమోట్ చేస్తున్నందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

అంతేకాకుండా ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ కి చెందిన 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా వేదికలను బ్లాక్ చేస్తున్నట్టు సమాచార శాఖ వెల్లడించింది. ఓటీటీలు, వెబ్ సైట్లలో ఉన్న అశ్లీల కంటెంట్‌ని తొలగించాలని, కొంతకాలంగా రోజుల నుంచి ఈ ఫ్లాట్‌ఫామ్స్‌ ను కేంద్రం హెచ్చరిస్తోంది.

అయినప్పటికీ వాటి నుంచి స్పందన లేకపోవడంతో నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఓటీటీలపై నిషేధం విధించాలని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మార్చి 12న ఆదేశాలు జారీ చేసినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. 10 యాప్స్‌ ని వెంటనే బ్లాక్ చేయాలని స్పష్టం చేశాయి. వాటిలో గూగుల్‌ ప్లే స్టోర్‌లోని 7 యాప్స్, ఆపిల్ స్టోర్‌లో మూడు ఉన్నాయి.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం 2000లోని నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్రం వెల్లడించింది. సంబంధింత శాఖ అధికారులతో పాటు మహిళా హక్కుల నిపుణులను సంప్రదించిన తరవాతే ఈ నిర్ణయం తీసుకుంది.

కేంద్ర నిషేధించిన ఓటీటీ యాప్స్ ఇవే!
Dreams Films
Voovi
Yessma
Uncut Adda
Tri Flicks
X Prime
Neon X VIP
Besharams
Hunters
Rabbit
Xtramood
Nuefliks
MoodX
Mojflix
Hot Shots VIP
Fugi
Chikooflix
Prime Play

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions