Biryani ATM | ఏటీఎం.. అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్.. సాధారణంగా ఏటీఎంను మనీ ట్రాన్సాక్షన్ లోనే వినియోగించేవాళ్లం.
ఆ తర్వాత వాటర్ ఏటీఎం, జ్యూస్ ఏటీఎం అని చాలా వచ్చాయి. అయితే మీరు బిర్యానీ ఏటీఎం గురించి విన్నారా..!
అదేంటీ బిర్యానీ కోసం ఏటీఎం ఏంటీ అని ఆశ్చర్యంగా ఉంది కదూ..! ఇది టెక్నాలజీ యుగం అండీ..! ఏదైనా సాధ్యమే.

అసలేంటీ బిర్యానీ ఏటీఎం.. ఎక్కడుందదీ.. ఎలా పనిచేస్తుంది. తదితర వివరాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ చదవండి.
ప్రజెంట్ జనరేషన్ లో బిర్యానీని ఇష్టపడని వారు చాలా అరుదు. వీకెండ్ మాత్రమే కాదు.. రోజూ బిర్యానీని లొట్టలేసుకుంటే ఆస్వాదించేవారు కోకొల్లలు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో బిర్యానీ ప్రియులు అధికం.
సరిగ్గా ఈ అవసరాన్నే అవకాశంగా మార్చుకుంది ఓ స్టార్టప్. చెన్నెలో బాల్ వీటు కళ్యాణం బిర్యానీ లేదా బీవీకే బిర్యానీ అనే హోటల్ ఉంది.
అక్కడ బిర్యానీ టెస్ట్ కి ఫ్యాన్స్ ఎక్కువ. సో తమ బిర్యానీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓ వినూత్న ప్రతయ్నం చేసింది. అదే బిర్యానీ ఏటీఎం. ఇంకే ఎంచక్కా కార్డు స్వైప్ చేస్తూ బిర్యానీ పట్టుకెళతున్నారు చెన్నై వాసులు.
Read Also: Cyber Crimes: జాగ్రత్త.. ఇంటర్నెట్‌లో ఈ పనులు అస్సలు చెయ్యొద్దు!
బిర్యానీ ఏటీఎం ఎలా పనిచేస్తుందంటే..!
బీవీకే బిర్యానీ హోటల్ ఏటీఎం కూడా సాధారణ ఏటీఎం మెషిన్ లాగే ఉంటుంది. కాకపోతే దీనిలో స్క్రీన్ సైజ్ కాస్త పెద్దదిగా ఉంటుంది.. మెనూ చూస్కొవాలి కదా మరి.!
బిర్యానీ ఏటీఎంలో 32 అంగుళాల స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. ఆ హోటల్ లో లభించే బిర్యానీల మెన్యూ అంతా స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
వాటిలో కావాల్సిన వాటిని ఎంచుకోవాలి. ఆ తరువాత డెబిట్, క్రెడిట్, యూపీఐ, లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా బిల్ పే చేయాలి.
అంతే.. కేవలం నాలుగు నిమిషాల్లోనే మీరు కోరుకున్న బిర్యానీ నీట్ గా ప్యాక్ అయి మీ ముందుకు వస్తుంది. బిర్యానీ పూర్తవగానే కాగానే స్క్రీన్ పై ప్రాంప్టింగ్ వస్తుంది.
వెంటనే డోర్ ఓపెన్ ఆప్షన్ ను క్లిక్ చేయాలి. దీంతో ఏటీఎం డోర్ ఓపెన్ అవుతుంది. బిర్యానీ ప్యాకెట్ బయటకి వస్తుంది. ఎంచక్కా ఆ బిర్యానీ తీసుకెళ్లి పోవచ్చు.
Also Read: 5 లక్షల కంటే తక్కువ ధరకు లభించే టాప్ – 5కార్లు ఇవే!
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి అన్నట్లు బిర్యానీ ప్రియులను మరింత ఆకట్టుకునేందుకు ఈ వినూత్న ఐడియాతో ఏటీఎంను రూపొందించిన బీవీకే బిర్యానీని స్థానికులు అభినందిస్తున్నారు.
పైగా బిర్యానీ కూడా చాలా రుచికరంగా ఉందని టాక్ రావడంతో చెన్నై నగరవ్యాప్తంగా వచ్చి తీసుకెళుతున్నారట.
ఈ బిర్యానీ ఏటీఎం ఐడియా సక్సెస్ కావడంతో ఇతర నగరాల్లోనూ తమ బిర్యానీ సెంటర్ లను ప్రారంభించే యోచనలో ఉంది.