Monday 16th March 2026
12:07:03 PM
Home > తాజా > తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి: కేటీఆర్

తెలంగాణ అభివృద్ధి చెందిందనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి: కేటీఆర్

ktr

KTR Tweet On TG Progress | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిలిచిందన్నారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జాతీయ స‌గ‌టు కంటే అధిక త‌ల‌స‌రి ఆదాయాన్ని న‌మోదు చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లు స్వ‌యంగా కేంద్ర‌మే పేర్కొందని తెలిపారు..

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు. ‘బీఆర్ఎస్ పాల‌న‌లో తెలంగాణ రాష్ట్రం అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందింద‌ని ప్ర‌ధాన‌మంత్రి ఆర్థిక స‌ల‌హా మండ‌లి చెప్పింది. తెలంగాణ అభివృద్ధి చెందింది అన‌డానికి ఇంత‌క‌న్న సాక్ష్యం ఏం కావాలి.

కేవ‌లం తొమ్మిదిన్న‌రేండ్ల‌లో జాతీయ స‌గ‌టు కంటే 94 శాతం అధిక త‌ల‌స‌రి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం న‌మోదు చేసింది. అన్ని రంగాల్లో తెలంగాణ‌ను అగ్ర‌గామిగా నిల‌పారు అన‌డానికి ఇది సాక్ష్యం. అంకెలు ఎప్పుడూ అబ‌ద్దాలు చెప్ప‌వు. కేసీఆర్ సాధించిన విజ‌యాలను ఎప్ప‌టికీ చెరిపేయ‌లేరు. ఈ లెక్క‌లు నేనేదో చెప్పడం లేదు.. కేంద్ర ప్ర‌భుత్వ‌మే స్వ‌యానా వెల్లడించింద‌’ని కేటీఆర్ పేర్కొన్నారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions