KTR Help | వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతల్‌తండాలో గత జూలై నెలలో ఓ ఉన్మాది చేతిలో కుటుంబ బలైన విషయం తెలిసిందే. బానోతు శ్రీనివాస్ సుగుణ దంపతుల కుమార్తె దీపిక, నాగరాజు అనే యువకుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకున్నారు.
అయితే నాగరాజు ప్రవర్తన సరిగా లేకపోవడంతో యువతి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇచ్చి దీపికను తల్లిదండ్రులతో పంపించారు. దీంతో ఆ కుటుంబంపై కోపం పెంచుకున్న నాగరాజు ఓ రోజు వారిపై తల్వార్ తో దాడికి పాల్పడ్డాడు. ఆ ఘటనలో దీపిక తల్లి దండ్రులు ఇద్దరూ మరణించారు.
ఆ సమయంలో బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దీపిక, ఆమె సోదరుడ్ని పరామర్శించి ధైర్యం, చెప్పారు. రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆ మేరకు తాజాగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ద్వారా తల్లిదండ్రులు కోల్పోయిన ఆ పిల్లలిద్దరికీ రూ. 5 లక్షల చెక్ అందజేసి మాట నిలబెట్టుకున్నారు.