- ఈడీ అదుపులో మాజీ సీఎం కేసిఆర్ కుమార్తె!
– ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టు చేస్తున్నట్లు వెల్లడి
– సుమారుగా నాలుగు గంటల పాటుగా ఆమె ఇంట్లో సోదాలు
BRS MLC Kavitha Arrest | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కల్వకుంట్ల కవితకు (Kalvakuntla Kavitha) మరో బిగ్ షాక్ తగిలింది. శుక్రవారం ఆమెను నేడు ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ఈడీ తెలిపింది.
బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించింది. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు.
కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. సోదాల సమయంలో ఇంట్లోకి ఎవరినీ అనుమతించలేదు. ఈ క్రమంలో కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు.
ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం కోర్టు అనుమతితో కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది.
లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు సంస్థల ముందు ఆమె విచారణకు హాజరవ్వాలా.. వద్దా.. అనే దానిపై ఆ రోజు విచారణ కీలకంగా మారనుంది.