Monday 12th May 2025
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ లక్ష్యంగా బీఆరెస్ బీసీ మంత్రం…!

కాంగ్రెస్ లక్ష్యంగా బీఆరెస్ బీసీ మంత్రం…!

Telangan Politics Around BC’s

అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే రాష్ట్రంలో ఎన్నికల వేడి మొదలయ్యింది.

కాంగ్రెస్ పార్టీలో బీసీ ( Bc )లకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ ( Demand ) చేస్తున్న నేపథ్యంలో బీఆరెస్ కూడా బీసీ మంత్రాన్ని జపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా బీఆరెస్ బీసీ అస్త్రాన్ని రూపొందిస్తోంది.

తెలంగాణ జనాభాలో సగంకు పైగా బీసీలు ఉంటారు. వారి ఓట్ల కోసం బీఆరెస్, కాంగ్రెస్ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.

బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా కాంగ్రెస్ బీసీ ఫోరమ్ ( Bc Forum ) తీర్మానం చేసింది. అలాగే రాబోయే రోజుల్లో బీసీలను దృష్టిలో పెట్టుకుని బీసీ డిక్లరేషన్ ( Declaration ) ను ప్రకటించడానికి కాంగ్రెస్ నాయకులు సిద్ధం అవుతున్నారు.

దీనికి ప్రతివ్యూహంగా బీఆరెస్ కూడా బీసీలపై కేంద్రీకరించింది. దీనితో తెలంగాణలో ప్రధాన అజెండాగా మారిన బీసీలు.

ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఈరోజు కాంగ్రెస్ నేతలు కోమటిరెడ్డి ఇంట్లో భేటీ అయ్యారు. ఆ భేటీకి ధీటుగా మంత్రి తలసాని ఇంట్లో బీఆరెస్ పార్టీ బీసీ నేతలు సమావేశం అయ్యారు.

Brs Bc Leaders Meeting| మంత్రి, బీఆరెస్ నేత తలసాని శ్రీనివాస్ ఇంట్లో బీఆరెస్ పార్టీకి చెందిన బీసీ నేతలు సమావేశం అయ్యారు.

ఈ సమావేశంలో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, బీఆరెస్ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు ఇతర నేతలు పాల్గొన్నారు.

సమావేశం అనంతరం నేతలు మీడియా ( Media )తో మాట్లాడారు.

బీఆరెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ నాయకత్వంలో బీసీల కోసం చాలా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తలసాని తెలిపారు.

బీసీల్లో కులవృత్తులు చేసుకునే వారికి ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు మంత్రులు పేర్కొన్నారు. అలాగే విద్యార్థులు, గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు ప్రభుత్వం అండగా ఉందని వారు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ బీసీల ఆత్మ గౌరవాన్ని పెంచారని మంత్రులు వ్యాఖ్యానించారు.

Brs Bc Leaders Fires On Congress| మరోవైపు కాంగ్రెస్ నాయకులు బీఆరెస్ బీసీ నాయకులని వ్యక్తిగతంగా విమర్శింస్తున్నారని మంత్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

బీసీ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, కించపరిచే విధంగా కాంగ్రెస్ పీసీసీ ( Pcc ) అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని బీఆరెస్ బీసీ మంత్రులు విమర్శలు గుప్పించారు.

బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని బీఆరెస్ నాయకులు అన్నారు.

బీసీల జోలికొస్తే బీసీల నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, ప్రజలు కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తారని వారు పేర్కొన్నారు.

బీసీలను అణిచివేయాలని లక్ష్యంతో బీసీ నాయకత్వాన్ని ఎదగనీయకుండా కాంగ్రెస్ పార్టీ కుట్ర పండుతుందని వారు ఆరోపించారు.

భవిష్యత్ కార్యాచరణను తొందరలో ప్రకటిస్తామని, కూలలా వారీగా మీటింగ్ ( Meeting ) లు పెడుతామని బీఆరెస్ నాయకులు తెలిపారు.

గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ బీసీలపై చేస్తున్న వ్యతిరేక విధానాలను ఎండగడతామని బీఆరెస్ మంత్రులు, నాయకులు స్పష్టం చేశారు. త్వరలోనే హైదరాబాద్ లో బీసీ సభను నిర్వహిస్తామని వారు ప్రకటించారు

You may also like
‘బీఆరెస్ సభ ఏర్పాట్లు కళ్ళు బైర్లు కమ్మేలా ఉంది..కానీ’
komatireddy venkat reddy
హత్యా రాజకీయాలు చేయడమేనా మీ గ్రాఫ్ కేసీఆర్?
Election commission
తెలంగాణలో ఎన్నికల నగారా.. ఆ స్థానాలకు షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ!
babu mohan joins tdp
టీడీపీలో చేరిన తెలంగాణ మాజీ మంత్రి!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions