Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > రండి.. ఫ్రీగా తీసుకెళ్లండి.. బట్టల షాప్ యజమాని బంపర్ ఆఫర్!

రండి.. ఫ్రీగా తీసుకెళ్లండి.. బట్టల షాప్ యజమాని బంపర్ ఆఫర్!

Street X offer

Give Away Offer | సాధారణంగా ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించేటప్పుడు ఎక్కువ మందిని ఆకర్షించడానికి భారీ డిస్కౌంట్ ప్రకటిస్తుంటారు. దీంతో పెద్ద ఎత్తున వినియోగదారులు వస్తుంటారు. అయితే ఆస్ట్రేలియాలోని పెర్త్ లో ఓ వ్యక్తి తన దుకాణానికి కస్టమర్లను ఆకర్షించడానికి ఓ బంపర్ ఆఫర్ ప్రకటించాడు. ఆ ఆఫర్ తో ఏకంగా తొక్కిసలాట కూడా జరిగింది.

బాక్సింగ్ డే సందర్భంగా స్ట్రీట్ ఎక్స్ అనే బట్టల షాపు యజమాని డేనియల్ బ్రాడ్.. వందలాది టీషర్టులు ఫ్రీగా ఇవ్వబోతున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో బాక్సింగ్ డే రోజున పెర్త్ లోని స్ట్రీట్ ఎక్స్ స్టోరు వందలాది మంది యువకులు చేరుకున్నారు. షట్టర్ తెరవగానే లోపలికి దూసుకెళ్లారు. తొక్కిసలాట సందర్భంగా కొంతమందికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి. దీనికి సంబంధించి వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions