- మూడో రోజు ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభం
Vaddepalli Rajeswar Rao | ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు.
వైద్య ఖర్చులు భారమవుతున్న నేపథ్యంలో పేదలకు సహాయపడే సంకల్పంతో ఆయన కూకట్ పల్లి నియోజకవర్గంలో వరుసగా 30 రోజులపాటు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయిస్తున్నారు.
కేబీకే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేసీఐ సూపర్ సహకారంతో నిర్వహిస్తున్న ఈ వైద్య శిబిరాలను ఆయన స్వయంగా సందర్శిస్తున్నారు.
అందులో భాగంగా మూడో రోజైన శుక్రవారం నాడు బాలానగర్ రాజీవ్ గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో వడ్డేపల్లి పాల్గొన్నారు.
హెల్త్ క్యాంప్ ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఆధునిక పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగులతో చాలా మంది ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని.. అది ఏమాత్రం సరికాదని హితవు పలికారు.
ఆరోగ్యం పట్ల నిత్యం శ్రద్ధ వహించాలని సూచించారు. అందుకే 30 రోజుల పాటు నిర్వహించే ఉచిత శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
Read Also: KBK Hospital ఫౌండర్ భరత్ కుమార్ కు సంజీవ రత్న పురస్కార్!
షుగర్ సంబంధిత వ్యాధులైన గ్యాంగ్రిన్, ఫుట్ అల్సర్లు, సెల్యూలైటిస్ లకు కాళ్లు చేతులు కొట్టేయకుండా మంచి ట్రీట్ మెంట్ ఇస్తున్న కేబీకే హాస్పిటల్ కు ప్రత్యేకంగా అభినందించారు.
అనంతరం కేబీకే హాస్పిటల్ రూపొందించిన హెల్త్ కార్డులను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ శిబిరంలో కూకట్ పల్లి అసెంబ్లీ మహిళా మోర్చా కన్వీనర్ కల్పన, రమేష్, శ్రీనివాస్ గౌడ్, దిలీప్, శంకర్ చౌదరి, శంకర్ రెడ్డి, మహేష్, ఈశ్వర్, దుర్గారావు, ప్రశాంత రావు, సోనా సింగ్, సంతోష్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.