BJP Musi Nidra | తెలంగాణ ప్రభుత్వం మూసి ప్రక్షాళనకు వేగంగా ముందుకువెళ్తుంది. అయితే మూసి ప్రక్షాళన చేయండి కానీ పేద ప్రజల ఇండ్లు మాత్రం కూల్చకండి అంటూ బీజేపీ డిమాండ్ ( Demand ) చేసింది.
ఈ మేరకు మూసి పరివాహిక ప్రాంతాల్లో ఆ పార్టీ నాయకులు మూసి నిద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్పెట్ ( Amberpet ) నియోజకవర్గం తులసిరాం నగర్ బస్తీలో ప్రజలతో ఒకరోజంతా గడిపరు.
అంబోజి శంకరమ్మ ఇంట్లో రాత్రి భోజనం చేశారు. అనంతరం బస చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన మూసి పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయానక పరిస్థితుల్లో ఉన్నట్లు చెప్పారు.
ప్రజాపాలన అంటే ఇల్లు కులగొట్టడమా అంటూ ప్రశ్నించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇల్లు కూల్చకుండా అభివృద్ధి చేయాలన్నారు.