Monday 16th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మసీదుకు వెళ్తే టోపీ పెట్టుకుంటారు కదా.. జగన్ కు బీజేపీ ఎంపీ కౌంటర్!

మసీదుకు వెళ్తే టోపీ పెట్టుకుంటారు కదా.. జగన్ కు బీజేపీ ఎంపీ కౌంటర్!

Raghunandan Rao

Raghunandan Rao Counter To Jagan | తిరుమల లడ్డూ (Tirumala Laddu) వ్యవహారంపై దుమారం రేగుతున్న తరుణంలో మాజీ సీఎం వైఎస్ జగన్ శనివారం తిరుమల వెళ్లాలనుకున్నారు. అయితే చివరి నిమిషంలో ఈ పర్యటన రద్దైంది.

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో డిక్లరేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, తెలంగాణలోని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఈ డిక్లరేషన్ వివాదంపై వైఎస్ జగన్ కు కౌంటర్ ఇచ్చారు. జగన్ తిరుమల వెళ్తానంటే బీజేపీ అడ్డుకోలేదన్నారు.

డిక్లరేషన్‌పై సంతకం పెట్టలేక జగన్ బీజేపీపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు. అన్యమతస్తులు దేవాలయాల్లోకి వెళితే డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలని రాజ్యాంగంలోనే ఉందని రఘునందన్ రావు గుర్తు చేశారు. మసీదులోకి వెళ్తే టోపీ, కర్చీఫ్ పెట్టుకుంటున్నారని, అలాంటప్పుడు డిక్లరేషన్‌పై సంతకం పెట్టాలి కదా అని రఘునందన్ రావు ప్రశ్నించారు.

You may also like
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
ys jagan
మీ తండ్రి వారసత్వాన్ని తాకట్టు పెట్టకండి.. వైఎస్ జగన్ కు యూత్ కాంగ్రెస్ కౌంటర్!
రాముడి గుడి కడితే మీరు ఒక ట్వీట్ అయినా చేశారా జగన్: నాగబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions