Friday 30th January 2026
12:07:03 PM
Home > Uncategorized > బీజేపీ రెండో జాబితా విడుదల..కీలక నేతలకు షాక్!

బీజేపీ రెండో జాబితా విడుదల..కీలక నేతలకు షాక్!

bjp telangana

BJP Second List | లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ (BJP)రెండో జాబితా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 72 మందితో కూడిన సెకం డ్ లిస్టును ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి ఆరుగురు అభ్యర్థులను కన్ఫాం చేసింది.

మెదక్ నుంచి రఘనందన్ రావు, నల్గొండ నుంచి శానంపూడి సైదిరెడ్డి, పెద్దపల్లి నుంచి గోమాస శ్రీనివాస్, ఆదిలాబాద్ నుంచి గోడం నగేశ్, మహబూబాబాద్ సీతారం నాయక్, మహబూబ్ నగర్ నుంచి డీకే ఆరుణ పేర్లను బీజేపీ ప్రకటించింది.

ఇప్పటికే ఫస్ట్ లిస్టులో 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ తాజా జాబితాతో తెలంగాణలో మొత్తం 15 స్థానాలకు క్యాండిడేట్లను అనౌన్స్ చేసింది. ఇక వరంగల్, ఖమ్మం స్థానాలను పెండింగ్ లో పెట్టింది. వరంగల్ నుంచి ఆరూరి రమేష్ పేరు దాదాపుగా ఖరారు అయినప్పటికీ చివరి నిమిషంలో ఆయన కేసీఆర్ తో భేటీ అవడంతో వాయిదా వేసింది.

ఇక ఖమ్మం నుంచి జలగం వెంకట్రావ్ పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు, మహబూబ్ నగర్ సీటు ఆశిం చిన జితేందర్ రెడ్డిలకు బిగ్ షాకిచ్చింది అధిష్టానం.

You may also like
గెలుపే లక్ష్యంగా తెలంగాణ వైపు బీజేపీ అధిష్టానం చూపు
madhavi latha
తెలంగాణలో పాకిస్తాన్ పౌరుల ఓట్లు.. సంచలన ఆరోపణలు!
‘తెలంగాణ పట్ల నాకు ఉన్న ప్రేమను ఎవరూ తగ్గించలేరు’
bandi sanjay
‘చార్ పత్తా ఆట..’ కవిత వ్యవహారంపై బండి సంజయ్ హాట్ కామెంట్స్!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions