Tuesday 17th March 2026
12:07:03 PM
Home > క్రీడలు > ఆసియా కప్.. భారత జట్టునుప్రకటించిన బీసీసీఐ!

ఆసియా కప్.. భారత జట్టునుప్రకటించిన బీసీసీఐ!

asia cup

Team India For Asia Cup | ప్రతిష్టాత్మక ఆసియా కప్ (Asia Cup) రానున్న సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. టీ20 ఫార్మాట్ లో జగరగనున్న ఈ సిరీస్ కు గానూ బీసీసీఐ సెలక్షన్ కమిటీ భారత జట్టును మంగళవారం ప్రకటించింది.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తదితరులు సమావేశమై 15 మంద సభ్యులతో ఆసియా కప్ లో పాల్గొనే భారత జట్టును ఎంపిక చేశారు. ఈ టీం కు శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు.

భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్

శుభ్ మన్ గిల్ వైస్ కెప్టెన్

అభిషేక్ శర్మ

తిలక్ వర్మ

హార్దిక్ పాండ్య

శివమ్ దూబే అక్షర్ పటేల్

జితేశ్ శర్మ వికెట్ కీపర్

జస్ప్రీత్ బుమ్రా

అర్షదీప్ సింగ్

వరుణ్ చక్రవర్తి

కుల్ దీప్ యాదవ్

సంజూ శాంసన్ వికెట్ కీపర్

హర్షిత్ రాణా

రింకూ సింగ్.

ఆసియా కప్ లో టీం ఇండియా తన మొదటి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. సెప్టెంబర్ 14న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ షెడ్యూల్ ఉంది.  

You may also like
భారత్ చేతిలో ఓటమి..సొంత ప్లేయర్లకు షాకిచ్చిన పాకిస్థాన్
తిలక్ వర్మను సత్కరించిన సీఎం
వర్మ ‘ది వారియర్’
IND vs PAK..స్టేడియం ఫుల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions