Bathukamma Young Filmmakers Challenge | రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో ‘బతుకమ్మ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్’ పోటీలను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను శనివారం విడుదల చేశారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, పండుగలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై యువత షార్ట్ ఫిల్మ్స్, సాంగ్స్ రూపొందించి మీ సృజనాత్మకతను చాటుకోవాలని పిలుపునిచ్చారు. షార్ట్ ఫిలిమ్స్ అయితే మూడు నిమిషాల, పాట అయితే ఐదు నిమిషాలు మించకూడదన్నారు. మేకర్స్ వయస్సు 40 ఏళ్ళు మించకూడదన్నారు. అలాగే 4K రిజల్యూషన్ లో చిత్రీకరణ ఉండాలన్నారు.
చిత్రీకరించే పాటలు లేదా షార్ట్ ఫిల్మ్ కేవలం ఈ ఛాలెంజ్ కోసమే ఈ ఉండాలని, అవి మునుపెప్పుడు ఎక్కడా ప్రదర్శించకుండా ఉండాలని స్పష్టం చేశారు. ఈ ఛాలెంజ్ లో గెలిచిన వారికి మొదటి బహుమతిగా రూ.3 లక్షలు, 2వ బహుమతి – రూ.2 లక్షలు, 3వ బహుమతి – రూ.1 లక్ష అలాగే ఐదు మందికి కన్సోలేషన్ బహుమతి రూ.20,000 చొప్పున అందించనుంది ప్రభుత్వం. చివరి తేదీ సెప్టెంబరు 30 లోగా 8125834009 వాట్సప్ నంబరుకు లేదా ‘youngfilmmakerschallenge@gmail.com’ కు మెయిల్ చేయాలని మంత్రి కోరారు.









