Thursday 21st November 2024
12:07:03 PM
Home > తాజా > ఓటుకు నోటు కేసు..రాహుల్ గాంధీ స్థానాన్ని కేటీఆర్ భర్తీ చేస్తున్నారు

ఓటుకు నోటు కేసు..రాహుల్ గాంధీ స్థానాన్ని కేటీఆర్ భర్తీ చేస్తున్నారు

Bandi Sanjay Hot Comments On KTR | మసకబారిన వ్యక్తిగా రాహుల్ గాంధీ ( Rahul Gandhi )స్థానాన్ని కేటీఆర్ ( KTR ) భర్తీ చేసే విధంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ ( Bandi Sanjay ).

కాగా ఓటుకు నోటు కేసులో వీడియోతో సహా ప్రస్తుత సీఎం రేవంత్ ( Revanth Reddy )పట్టుబడితే ఆయన్ను జైల్లో వేయడంలో బీజేపీ విఫలమైందని కేటీఆర్ విమర్శించారు. ఈ నేపథ్యంలో బండి సంజయ్ స్పందించారు.

మొదట అమెరికా నుండి రాష్ట్రానికి వచ్చిన కేటీఆర్ కు బండి స్వాగతం పలికారు. జెట్ లాగ్ ( Jet Lag ), అమెరికా పర్యటన కేటీఆర్ పై ప్రభావం చూపుతున్నాయని విమర్శించారు.

ఓటుకు నోటు కేసు ఏసీబీ ( ACB ) పరిధిలో ఉందని, 2015 నుండి అసమర్ధ బీఆరెస్ ప్రభుత్వం విచారణ చేయడంలో విఫలమైందని బండి సంజయ్ ధ్వజమెత్తారు. కానీ, ఇప్పుడు ట్విట్టర్ స్టార్ డం ( Twitter Stardom ) కోసం కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారని విమర్శించారు.

ఓటుకు నోటు కేసులో నిజంగా న్యాయం కావాలంటే, అప్పుడే కేసును సీబీఐకి లేదా ఈడీకి అప్పగించి ఉండాల్సిందని తెలిపారు.

You may also like
నరేందర్ రెడ్డిని ఉగ్రవాదిలా ఎందుకు అరెస్ట్ చేశారు : హై కోర్టు
కాళేశ్వరం లేకున్నా రికార్డు స్థాయిలో వరి ధాన్యం
ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని కుట్ర చేస్తున్నారు
బీజేపీ కార్యాలయంలో బిర్సాముండా జయంతి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions