Bandi Sanjay KTR Meet | తెలంగాణలో బీజేపీ (BJP), బీఆరెస్ (BRS) పార్టీలు రెండూ రాజకీయ ప్రత్యర్థులు. నిత్యం ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంటుంది.
ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) బీఆరెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)పై తరచూ ఘాటు విమర్శలు చేస్తుంటారు.
కేటీఆర్ కూడా అంతే స్థాయిలో స్పందిస్తుంటారు. అలాంటిది ఇద్దరూ ఎదురుపడితే ఎలా ఉంటది. సిరిసిల్ల జిల్లాలో గురువారం ఈ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. జిల్లాలోని నర్మాలలో వరదల కారణంగా సహాయ కార్యక్రమలు జరుగుతున్నాయి.
కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆర్మీ హెలికాఫ్టర్లు తెప్పించి రెస్క్కూ ఆపరేషన్స్ ను పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వరద బాధితులను పరామర్శించడానికి కేటీఆర్ కూడా వచ్చారు.
ఇలా ఇద్దరు ఎదురు పడ్డారు. ఇద్దరూ ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.









