Thursday 19th September 2024
12:07:03 PM
Home > తాజా > రికార్డు బద్దలుకొట్టిన బాలాపూర్ లడ్డూ..ఈ సారి ఎంత ధర పలికిందంటే !

రికార్డు బద్దలుకొట్టిన బాలాపూర్ లడ్డూ..ఈ సారి ఎంత ధర పలికిందంటే !

Balapur Ganesh Laddu | ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బాలాపూర్ గణేష్ ( Balapur Ganesh ) లడ్డూ రికార్డు బద్దలు కొట్టింది. గతేడాదితో పోల్చొతే ఈసారి రూ.3 లక్షలు అధిక ధరకు లడ్డూ పలికింది.

11 రోజుల పాటు వేద మంత్రోచ్ఛరణ మధ్య గణనాథుడి చేతిలో ఉన్న లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. పోటాపోటీగా సాగిన వేలంలో రూ.30 లక్షల ఒక వెయ్యి కి సింగిల్ విండో ఛైర్మన్ కొలను శంకర్ రెడ్డి ( Kolanu Shankar Reddy ) తొలిసారి వేలంపాటలో బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు.

చరిత్రలో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. గతేడాది రూ.27 లక్షలు పలికింది. ఇదిలా ఉండగా 1994 నుండి బాలాపూర్ లడ్డూ వేలం కొనసాగుతుంది. ఆ సంవత్సరం రూ.450 తో మొదలైన లడ్డూ వేలం ప్రతీ ఏడాది రికార్డులు బద్దలు కొడుతుంది.

You may also like
మహాగణపతి శోభాయాత్ర..హుస్సేన్ సాగర్ వద్ద సీఎం రేవంత్
వినాయకుడి లడ్డూ దొంగలున్నారు జాగ్రత్త
వినాయక చవితి..ఏ సమయంలో విగ్రహాన్ని ప్రతిష్టించాలి..ఎప్పుడు చంద్రున్ని చూడొద్దు ?
khairatabad ganesh 2024
ఈసారి ఖైరతాబాద్ గణేష్ విగ్రహం ఎత్తు ఎంతంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions