Balakrishna Rides On Cycle At Parliament | హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం పార్లమెంటు ఆవరణలో సందడి చేశారు. పార్లమెంటును సందర్శించిన బాలకృష్ణ ఈ సందర్భంగా విజయనగరం ఎంపీ అప్పలనాయుడుని కలిశారు.
పార్లమెంటు గేటు పక్కన ఉండే పార్కింగ్ లో ఉండే ఎంపీ అప్పలనాయుడు సైకిల్ ను పరిశీలించారు. పార్లమెంటుకు వెళ్లే సమయంలో అప్పలనాయుడు సైకిల్ పైనే ప్రయాణం చేస్తారు అనే విషయం తెల్సిందే. కాసేపు సైకిల్ పై కూర్చుని బాలకృష్ణ సందడి చేశారు.
సైకిల్ ను చూసిన వెంటనే దివంగత ముఖ్యమంత్రి, తన తండ్రి ఎన్టీఆర్ గుర్తువచ్చారని బాలకృష్ణ పేర్కొన్నారు. తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారని పేర్కొన్నారు.
టీడీపీ గుర్తు సైకిల్ పై పార్లమెంటుకు రావడం అభినందనీయమని ఎంపీని కొనియాడారు. టీడీపీ ప్రాముఖ్యతను దేశం అంతటా తెలిపేలా అప్పలనాయుడు సైకిల్ పై పార్లమెంటుకు రావడం హర్షణీయమని అన్నారు.









