Wednesday 16th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > కాబోయే అమెరికా ప్రెసిడెంట్ ఎవరో చెప్పేసిన బేబీ హిప్పో

కాబోయే అమెరికా ప్రెసిడెంట్ ఎవరో చెప్పేసిన బేబీ హిప్పో

Baby Hippo Predicts US Election Results | అమెరికా ఎన్నికల పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ ( Republican ) అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ), డెమెక్రటిక్ ( Democratic ) అభ్యర్థి కమలా హ్యారీస్ ( Kamala Harris ) మధ్య తీవ్ర పోటీ నెలకొంది.

ఏ అభ్యర్థి వైపు ఓటర్లు మొగ్గు చూపారనే విషయాన్ని ఒపీనియన్ పోల్స్ కూడా పట్టుకోలేకపోతున్నాయి. ఈ క్రమంలో అమెరికాకు కాబోయే ప్రెసిడెంట్ ఎవరూ అనే దానిపై ఓ బేబి హిప్పో ( Baby Hippo ) జోస్యం చెప్పింది.

థాయిలాండ్ ( Thailand ) లోని మూ డెంగ్ ( Moo Deng ) అనే హిప్పోపోటమస్ భవిష్యత్ ను అంచనా వేయడంలో చాలా ఫేమస్. ఈ క్రమంలో బేబీ హిప్పో ముందు పుచ్చకాయలో పండ్లను పెట్టి అలంకరించి వాటిపై ట్రంప్ మరియు కమలా పేర్లను రాసి పెట్టారు.

బేబి హిప్పో నీటి నుండి బయటకు వచ్చి ట్రంప్ పేరున్న వాటర్ మెలన్ ను తింది. దీంతో ట్రంపే కాబోయే ప్రెసిడెంట్ అని అక్కడివారు కేరింతలు కొట్టారు. మరోవైపు తల్లి హిప్పో మాత్రం కమలా పేరున్న వాటర్ మెలన్ ను తినేసింది.

You may also like
బ్రిటన్ రాజుతో టీం ఇండియా ప్లేయర్లు
భూమిపైకి వచ్చేసిన శుభాంశు శుక్లా
పార్టీ నాయకుడి కుమారుడికి జగన్ నామకరణం
డిప్యూటీ సీఎంకు లీగల్ నోటీసులు పంపిన బీజేపీ చీఫ్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions