Wednesday 18th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > ట్రంప్-పుతిన్ భేటీ..పై నుంచి బీ-2 బాంబర్లు

ట్రంప్-పుతిన్ భేటీ..పై నుంచి బీ-2 బాంబర్లు

B-2 Bomber Roars Over Putin’s Head During Alaska Summit With Trump | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలాస్కాలోని జాయింట్ బేస్ ఎల్మెండోర్ఫ్-రిచర్డ్‌సన్‌లో శుక్రవారం భేటీ అయ్యారు.

ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో ఈ భేటీ జరిగింది. అయితే ఈ సందర్భంగా అమెరికా తన సైనిక శక్తిని ప్రదర్శించడం ఆసక్తిగా మారింది. పుతిన్-ట్రంప్ రెడ్ కార్పెట్ పై నడుస్తూ వెళ్తున్న సమయంలో B-2 స్టెల్త్ బాంబర్‌లు మరియు F-35, F-22 రాప్టర్ ఫైటర్ జెట్‌లతో కూడిన ఫ్లైఓవర్ జరిగింది.

పై నుంచి ఫైటర్ జెట్లు వెళ్లాడాన్ని గమనించిన పుతిన్ ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే దీనిని అమెరికా పవర్ ప్లే గా పలువురు విశ్లేషణలు చేస్తున్నారు. ఇజ్రాయిల్-ఇరాన్ ఘర్షణలో భాగంగా అమెరికా బీ-2 బాంబర్లతో ఇరాన్ లోని న్యూక్లియర్ సైట్లపై దాడులు చేసిన విషయం తెల్సిందే. ఇకపోతే ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై ఈ భేటీలో ఎలాంటి ఒప్పందం జరగలేదు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions