Attack On Rtc Conductor| మద్యం మత్తులో ఓ మహిళా ప్రయాణికురాలు ఇద్దరు బస్ కండక్టర్ల ( Bus Conductor )పై దుర్భాషలాడుతూ, దాడికి యత్నించిన ఘటన సంచలనంగా మారింది.
హయత్నగర్ ( Hayath Nagar ) డిపో-1 ( Depot-1 ) కు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ మహిళ మద్యం మత్తులో దాడికి యత్నించింది. మొదటి ట్రిప్పని ( Trip ), తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించినా ఆ మహిళా ఏమాత్రం వినకుండా దాడికి పాల్పడ్డారు.
అలాగే మహిళా కండక్టర్ పై కూడా విచక్షణారహితంగా దుర్బషలాడింది ఆ సదరు మహిళ. ఈ క్రమంలో జరిగిన ఘటనపై సీరియస్ ( Serious ) అయ్యారు ఆర్టీసీ ( TSRTC ) ఎండీ సజ్జనర్ ( M.D. Sajjanar ).
ఈ ఘటనపై రాచకొండ ( Rachakonda ) కమిషనరేట్ ఎల్బీనగర్ ( Lb Nagar ) పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు, ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు సజ్జనర్. నిబద్దతతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు ఆయన.









