attack on indian consulate
అమెరికాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్తాన్ మద్దతుదారులు.
అమెరికా దేశం శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని భారత దౌత్యకార్యలయం పైన దాడికి పాల్పడ్డారు.
భారత దౌత్యకార్యాలయన్నీ (indian consulate) దహనం చేయడానికి ప్రయత్నించారు.గడిచిన ఐదు నెలల్లో ఇది రెండోసారి.
ఈ చర్యను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.ఈ నేరానికి పాల్పడిన వారు కచ్చితంగా శిక్షను ఎదుర్కొంటారని పేర్కొంది.
అమెరికా
అమెరికా మీడియా కథనాల ప్రకారం…
శాన్ ఫ్రాన్సిస్కో నగరంలోని భారత దౌత్యకార్యలనికి ఆదివారం వేకువజామున 1.30 నుండి 2.30 ప్రాంతంలో కొందరు ఖలిస్తాన్ మద్దతుదారులు నిప్పుపెట్టారు. ఈ సంఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదని అమెరికా ప్రభుత్వం పేర్కొంది.ఈ దాడికి సంబందించిన వీడియోను ఖలిస్తాన్ మద్దతుదారులు విడుదల చేశారు.అలాగే దౌత్యకార్యాలనికి నిప్పు పెట్టె సమయంలో వారు ఖలిస్తాన్ కు మద్దతుగా నినాదాలు చేశారు.
అయితే ఈ దాడిపై స్పందించిన అమెరికా విదేశాంగ ప్రతినిది మాత్యు మిల్లర్ (matthew miller) తీవ్రంగా ఖండించారు. “శనివారం శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై జరిగిన విధ్వంసం మరియు దహన ప్రయత్నాన్ని అమెరికా తీవ్రంగా ఖండిస్తోంది. U.S.లోని దౌత్య సదుపాయాలు లేదా విదేశీ దౌత్యవేత్తలకు వ్యతిరేకంగా విధ్వంసం లేదా హింస నేరం”. అని వారు ట్విట్టర్ వేదికగా స్పందించారు.
పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ కు మద్దతుగా కొన్ని రోజులు విద్వంసాన్ని సృష్టించిన అమృత్ పాల్ సింగ్ కోసం ఈ సంవత్సరం మార్చ్ నెలలో దేశవ్యాప్తంగా అతనికోసం గాలింపు చర్యలు ప్రారంభమయ్యాయి.
అప్పుడు అమృత్ పాల్ కు మద్దతుగా మార్చ్ నెలలో దౌత్య కార్యాలయం పైన ఖలిస్తాన్ మద్దతుదారులు దాడి చేశారు.