Friday 30th January 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మరో రెండురోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా

మరో రెండురోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా

Arvind Kejriwal Resignation News | ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ( Cm Arvind Kejriwal ) సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండ్రోజుల్లో సీఎం పదవికి రాజీనామా ( Resign ) చేయనున్నట్లు ఆదివారం ప్రకటించారు.

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో సుమారు ఆరు నెలల తర్వాత కేజ్రీవాల్ బెయిల్ పై విడుదలైన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఆప్ కార్యకర్తలతో కేజ్రీవాల్ సమావేశం అయ్యారు.

ఈ సందర్భంగా, తాను నిర్దోషిగా నిరూపితం అయ్యేంతవరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగనని స్పష్టం చేశారు. మహారాష్ట్రతో పాటే ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

తాను అగ్నీపరీక్షకు సిద్ధమన్నారు. ఎన్నికల ప్రచారంలో ఢిల్లీలోని ప్రతీ ఇంటికి వెళ్ళీ నిర్దోషినైతేనే తనకు ఓట్లు వేయాలని కోరుతానని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడే ఆప్ ను ముందుకు నడిపించారని తెలిపారు. దేశాన్ని బలహీన పరుస్తున్న, విభజిస్తున్న శక్తులపై తన పోరాటం ఆగదన్నారు.

You may also like
దశాబ్దాల తర్వాత రాహుల్ గాంధీ చెంతకు తాత డ్రైవింగ్ లైసెన్సు
‘నేను కార్యకర్తను..ఆయన నా బాస్’
కొత్త పార్టీ ఏర్పాటు దిశగా కవిత.. కీలక నేతతో భేటి?
‘మోదీ జీ ఆయనకు భారత రత్న ఇచ్చి ఆశ్చర్యపరచండి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions