Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > మోహన్ లాల్ ను ఘనంగా సత్కరించిన భారత ఆర్మీ

మోహన్ లాల్ ను ఘనంగా సత్కరించిన భారత ఆర్మీ

Army Chief Gen Dwivedi felicitates Lt Col (Honorary) Mohanlal | నటుడు మోహన్ లాల్ ను భారత ఆర్మి ఘనంగా సత్కరించింది. ఇటీవలే ప్రతిష్టాత్మకమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డును అందుకున్న మోహన్ లాల్ ను ‘సీవోఏఎస్ కమెండేషన్ కార్డు’ తో సత్కరించారు ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది.

భారతసైన్యం యొక్క దేశ నిర్మాణ కార్యక్రమాలు మరియు మానవతా సహాయ ప్రయత్నాలకు మోహన్ లాల్ అచంచలమైన నిబద్ధత మరియు నిరంతర మద్దతు అందించారని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ప్రశంసించారు. సైనికులను గౌరవించే కార్యక్రమాలకు, యువతను స్వచ్చంధ సేవలలో చేరేలా ప్రేరేపించడానికి మరియు సైన్యం యొక్క మానవతా కార్యకలాపాల పాత్ర గురించి అవగాహన కల్పించడానికి మోహన్ లాల్ చురుకుగా దోహదపడ్డారని అభినందించారు.

ఈ నేపథ్యంలో మోహన్ లాల్ స్పందించారు. ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తనను ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌కు పిలిచిన ఏడుగురు ఆర్మీ కమాండర్ల సమక్షంలో ‘COAS కమెండేషన్ కార్డ్’ అందించి గౌరవ లెఫ్టినెంట్ కల్నల్‌గా గుర్తించడం గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సైన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions