Apple Fires 185 Telugu Speaking Employees Over CSR Scam | తెలుగు మూలాలు ఉన్న 185 మంది ఉద్యోగుల్ని టెక్ ( Tech ) దిగ్గజం ఆపిల్ తొలగించడం కలకలం రేపుతోంది. తెలుగు సంఘాల పేరిట మోసం జరుగుతుందా ? ఆపిల్ సంస్థ నిధులు నిజంగా దారి మళ్లాయా ? అనేవి హాట్ టాపిక్ గ్ మారింది.
ఈ ఘటన అనంతరం యూఎస్ ( USA ) లోని తెలుగువారు ఆందోళనకు గురవుతున్నారు. అమెరికా బే ఏరియాలోని ఐఫోన్ తయారీ ఆపిల్ కార్యాలయంలో ఇటీవల 185 మంది ఉద్యోగుల్ని తొలగించారు. వీరిలో దాదాపు అందరూ తెలుగువారే.
అయితే ఖర్చును తగ్గించుకునేందుకు చేసే లేఆఫ్స్ ( Layoff ) కింద ఈ ఉద్యోగుల్ని తొలగించలేదు. కొన్ని మీడియా కథనాల ప్రకారం ఆపిల్ సంస్థలో పనిచేసే కొందరు తెలుగు ఉద్యోగులు సంస్థ అందించే మ్యాచింగ్ గ్రాంట్స్ ( Matching Grant ) ను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
కాగా అమెరికాలోని కొన్ని నాన్ ప్రాఫిటబుల్ ( Non-Profitable ) తెలుగు సంఘాలు విరాళాల కోసం తెలుగు మూలాల ఉన్న ఉద్యోగుల్ని సంప్రదిస్తుంటాయి. ఈ క్రమంలోనే ఆపిల్ సంస్థలో పనిచేసే ఉద్యోగుల్ని సదరు సంఘాలు సంప్రదించినట్లు తెలుస్తోంది.
అనంతరం ఆపిల్ లో పనిచేసే తెలుగు ఉద్యోగులు సంఘాలకు విరాళాలు ఇచ్చారు. ఇదే సమయంలో కార్పోరేట్ సోషల్ రెస్పాన్సిబిల్టీ ( Corporate Social Responsibility ) కింద ఉద్యోగులు ఇచ్చిన డోనేషన్స్ ( Donations ) కు సమానంగా ఆపిల్ సంస్థ కూడా సదరు సంఘాలకు విరాళం ఇచ్చింది.
అంటే ఎవరైనా ఆపిల్ ఉద్యోగి లాభాపేక్ష లేని సంఘానికి విరాళం ఇస్తే సీఎస్ఆర్ కింద ఆపిల్ సంస్థ కూడా ఉద్యోగి ఎన్ని డబ్బులు ఇచ్చారో అదే మొత్తంలో సదరు సంఘానికి చెల్లిస్తుంది. అయితే ఆపిల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ( Finance Department ) ఇందులో అక్రమాలను గమనించిందని తెలుస్తోంది.
కొన్ని తెలుగు సంఘాలు ఆపిల్ సీఎస్ఆర్ నిబంధనలను తారుమారు చేసి అక్రమంగా నిధులను పొగుచేయడం ప్రారంభించినట్లు, అనంతరం డబ్బులను దారి మళ్లించడం జరిగిందంట.
అలాగే తెలుగు అసోసియేషన్స్ కు డబ్బులు ఇచ్చినట్టే ఇచ్చి ఉద్యోగులు, డబ్బుల్ని తిరిగి పొందారని సంస్థ గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి. తమ మ్యాచింగ్ గ్రాంట్స్ ను ఉద్యోగులు దుర్వినియోగం చేశారని ఆపిల్ సంస్థ యూఎస్ లోని ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ( IRS ) విభాగానికి ఫిర్యాదు చేసింది.
నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ పేరుతో కొన్ని తెలుగు సంఘాలు ఓ పెద్ద స్కామ్ నే నడిపించారని ఇదే విషయాన్ని గమనించిన ఆపిల్ సంస్థ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కు విషయాన్ని వెల్లడించింది.
అంతేకాకుండా స్కామ్ ను అమలుపరచడానికి కొన్ని సంఘాలు ఆపిల్ సంస్థ ఉద్యోగుల్ని ఉపయోగించుకున్నట్లు సమాచారం. ఈ స్కామ్ వెలుగులోకి వచ్చిన తర్వాతే ఆపిల్ సంస్థ 185 మంది ఉద్యోగుల్ని తొలగించింది.
ఈ నేపథ్యంలో సంస్థ నిధులను దారి మళ్లించడమే నిజం అయితే అమెరికాలో పనిచేస్తున్న కొన్ని తెలుగు సంఘాలపై అనుమానాలు పెరగడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి.
అలాగే ఈ అంశం తమ ఉద్యోగ భవిష్యత్ పై ఎలాంటి ప్రభావం చూపుతుందో అని అమెరికాలోని తెలుగు ఎంప్లాయిస్ కంగారు పడుతున్నారు.