AP Police Constable results 2025 out | ఆంధ్రప్రదేశ్ లో 6,100 పోలీస్ కానిస్టేబుళ్ల పోస్టులకు భర్తీకి సంబంధించి శుక్రవారం ఫలితాలు విడుదల అయ్యాయి.
డీఐజీ కార్యాలయంలో ఫలితాలను హోంమంత్రి అనిత విడుదల చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఆర్.కే మీనాతో కలిసి హోంమంత్రి ఫలితాలు విడుదల చేశారు.
168 మార్కులతో ప్రథమ స్థానంలో గండి నానాజీ, 159 మార్కులతో రెండో స్థానంలో రమ్య మాధురి, మూడో స్థానంలో 144.5 మార్కులతో మెరుగు అచ్యుతరావు నిలిచారు. ఈ నేపథ్యంలో తుది ఫలితాల్లో అర్హత సాధించిన వారికి హోంమంత్రి అనిత అభినందనలు తెలియజేశారు.









