AP Govt Allows Special Ticket Price Hike for Hari Hara Veeramallu | ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘హరిహర వీరమల్లు’.
జులై 24న సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మరోవైపు టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతినివ్వాలని నిర్మాత రత్నం తెలంగాణ ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు.
దీనిపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. కాగా సినిమా విడుదలైన మొదటి పది రోజులకు రేట్లు పెంచుకునేందుకు ఏపీ ఒకే చెప్పింది. ఈ నేపథ్యంలో సింగిల్ స్క్రీన్ థియేటర్ లో లోయర్ క్లాస్ టికెట్ పై జిఎస్టీతో కలిపి రూ.100, అప్పర్ క్లాస్ పై జిఎస్టీతో కలిపి రూ.150 పెంచుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అలాగే మల్టీప్లెక్స్ లో జిఎస్టీతో కలిపి రూ.200 వరకు పెంచేందుకు అనుమతి ఇచ్చింది. విడుదలకు ముందు రోజు అంటే జులై 23న ప్రీమియర్ షోలకు సైతం ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. వీటి ధర రూ.600 అలాగే జిఎస్టీ అదనంగా ఉండనుంది. అయితే కేవలం అనుమతి ఇచ్చిన థియేటర్లలో మాత్రమే ప్రీమియర్ షోల ప్రదర్శన జరగనుంది.









