AP Budget 2024 | 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ బుధవారం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. రూ. 2 లక్షల 86 వేల 389 కోట్లతో వార్షిక బడ్జెట్ ను ప్రకటించారు.
రెవెన్యూ వ్యయం రూ.2లక్షల 30వేల 110 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ.30వేల 530 కోట్లు, ద్రవ్యలోటు రూ.55వేల 817కోట్లు, రెవెన్యూ లోటు రూ.24వేల 758 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 1.56శాతం, జీఎస్డీపీలో ద్రవ్యలోటు 3.51శాతం అని పేర్కొన్నారు మంత్రి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..సీఎం జగన్ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావిస్తారని తెలిపారు. ఇప్పటి వరకు ఎవరూ చేయని పనులను తమ ప్రభుత్వం చేసిందని వెల్లడించారు బుగ్గన. కాగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది ఎన్నిక కాబోయే కొత్త ప్రభుత్వం.