Thursday 24th April 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!

తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!

Chandra Babu Naidu

ChandraBabu Comments On TS Results | చంద్రబాబు, తెలంగాణ ఎన్నికల ఫలితాలు, బీఆరెస్ ఓటమి, చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు, టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల సంభవించిన మిచౌంగ్ తుఫాను కారణంగా ఏపీ లోని కొన్ని ప్రాంతాల్లో పంట తీవ్రంగా నష్టపోయింది. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నష్టపోయిన పంటను పరిశీలించారు బాబు. అలాగే పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అహంకారంతో విర్రవీగితే ఏమవుతుందో తెలంగాణ లో చూశాం, అలాగే ఏపీ లో కూడా మరో మూడు నెలల్లో చూస్తామని వ్యాఖ్యానించారు. 

45 ఏళ్లుగా తాను ఏ తప్పు చేయలేదని అయినా కక్ష పూరితంగా తనను జైలులో పెట్టి క్షోభకు గురి చేశారని ఆరోపించారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోయిన నేపథ్యంలో చంద్రబాబు అహంకారం అంటూ తెలంగాణ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

You may also like
‘నేను పాకిస్థానీ కాదు..ప్రభాస్ హీరోయిన్ కీలక పోస్ట్’
‘ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వదిలేదే లేదు’
‘ఐఎన్ఎస్ సూరత్ సీ స్కిమ్మింగ్’
‘మోదీజీ ఈ లాఠీ తీసుకోండి..ప్రధానిపై షర్మిల ఫైర్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions