ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు!
ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ టీడీపీ జనసేన పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పడి వచ్చే జూన్ 4 వ తేదీకి ఏడాది పూర్తవనుంది. ఈ సందర్భంగా ఆరోజున రాష్ట్రంలో ఘనంగా వేడుకలు నిర్వహించుకోవాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపినిచ్చారు.
జూన్ 4న రాష్ట్ర ప్రజలు సంక్రాంతి దీపావళి పండుగలను కలిపి జరుపుకోవాలని సూచించారు. ఈ నేపథ్యంలో జనసేన నాయకులు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు. సుపరిపాలన మొదలై ఏడాది అనే పేరుతో 4వ తేదీ ఉదయం ప్రజలు వాకిళ్లను రంగవల్లులతో అలంకరించాలనీ, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించాలని సూచించారు.
పీడ విరగడై ఏడాది అనే పేరుతో సాయంత్రం దీపావళి పండుగలా దీపాలు వెలిగించి, టపాకాయాలు కాల్చాలని తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పేర్కొన్నారు.









