Anil Ravipudi About ‘Bhagawanth Kesari’ Success | నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమా ‘భగవంత్ కేసరి’. ఈ మూవీ 2023లో విడుదలైంది. అయితే ఈ సినిమా ఆశించిన మేర సక్సెస్ అవ్వలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు దర్శకుడు అనిల్ రావిపూడి. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమా బ్లాక్ బస్టర్ అయిన విషయం తెల్సిందే. ప్రస్తుతం దర్శకుడు అనిల్ ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రావిపూడి భగవంత్ కేసరి ఫలితంపై స్పందించారు. ఈ సినిమా ఇంకా హిట్ అవ్వాల్సిందన్నారు.
తాను ఎంతో కష్టపడి రాసుకున్న కథల్లో భగవంత్ కేసరి ఒకటని పేర్కొన్నారు. అయితే సినిమా విడుదల సమయంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అవ్వడం, జైలుకు వెళ్లడం జరిగాయని గుర్తుచేసుకున్నారు. చంద్రబాబు అరెస్ట్ తో బాలయ్య అభిమానులు నిరాశకు గురయ్యారని అయినప్పటికీ సాధారణ ప్రేక్షకులే థియేటర్లకు క్యూ కట్టి సినిమాను విజయం చేశారన్నారు. ఆ పరిణామాలు జరగకపోయి ఉంటే సినిమా మరింత విజయాన్ని సొంతం చేసుకునేదన్నారు.









