Amitabh Praises Allu Arjun | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) పై ప్రశంసలు కురిపించారు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bacchan). ఇటీవల విడుదలైన పుష్ప-2 ది రూల్ (Pushpa 2) బాలీవుడ్ గత రికార్డులను తిరగరాస్తోంది.
ఈ క్రమంలో పలువురు బాలీవుడ్ (Bollywood) స్టార్స్ అల్లు అర్జున్ నటనను మెచ్చుకుంటున్నారు. మరోవైపు తాను అమితాబ్ బచ్చన్ కు అభిమానినని, ఆయన తనకు నిత్యం స్ఫూర్తినిస్తుంటారని అల్లు అర్జున్ ఓ కార్యక్రమంలో భాగంగా చెప్పారు.
అల్లు అర్జున్ కామెంట్లపై అమితాబ్ స్పందించారు. ‘అల్లు అర్జున్ జీ మీ మాటలకు కృతజ్ఞుడిని. నా అర్హత కంటే ఎక్కువే చెప్పారు. మీ కష్టానికి మరియు ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం.
మీరు మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు, మీరు మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా’ అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు