Tuesday 17th March 2026
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > పవన్ సీఎం అవ్వాలంటే గోవా వెళ్ళాలి

పవన్ సీఎం అవ్వాలంటే గోవా వెళ్ళాలి

Ambati Rambabu Counter To Pawan Kalyan | వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ సూచించారు. ఈ క్రమంలో పవన్ కు మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం అయిన విషయం తెల్సిందే. ఈ సందర్భంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ నుండి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరియు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాక్ ఔట్ చేశారు.

దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ..ఓట్ల శాతం ప్రకారం భారత్ లో సీట్లు హోదాలు ఇవ్వరని పేర్కొన్నారు. ఒకవేళ వైసీపీకి ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ వెళ్లాలని ఎద్దేవా చేశారు.

ఈ వ్యాఖ్యలపై స్పందించిన అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే గోవా వెళ్లాలని కౌంటర్ ఇచ్చారు. గోవా అసెంబ్లీలో 40 స్థానాలు ఉండగా, అధికారాన్ని చేపట్టాలంటే మేజిక్ ఫిగర్ 21. ప్రస్తుతం జనసేనకు 21 సీట్లు ఉన్న విషయం తెల్సిందే. 21 స్థానాలతో పవన్ సీఎం అవ్వలేరని అంబటి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
gaddar awards
గద్దర్ సినీ అవార్డులను ప్రకటించిన ప్రభుత్వం.. ఉత్తమ చిత్రం ఏదంటే!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions