Allu Arjun Pressmeet | సంధ్య థియేటర్ (Sandhya Theatre) ఘటనలో అరెస్టయిన నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) శనివారం ఉదయం 6 గం. 40 నిలకు విడుదల అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
కష్ట సమయంలో అండగా నిలిచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మీ ప్రేమాభిమానాలతో నా హృదయం నిండిందన్నారు. సంధ్య థియేటర్ వద్ద చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరమని చెప్పారు. ఆ కుటుంబానికి జరిగిన దానికి తాను ఎంతగానో బాధపడుతున్నానని తెలిపారు.
రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానన్నారు. ఆ ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిన ఘటన కాదనీ, ప్రమాదవశాత్తూ జరిగిందని తెలిపారు. అనుకోకుండా జరిగిన ఆ ఘటనలో తన ప్రమేయం లేదు. కుటుంబంతో కలిసి నేను థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు ఇది చోటుచేసుకుందని చెప్పారు.
త్వరలోనే రేవతి కుటుంబాన్ని కలుస్తానని తెలిపారు. ప్రస్తుతం కేసు కోర్టులో ఉందనీ. దీని గురించి మాట్లాడాలనుకోవడం లేదని అల్లు అర్జున్ చెప్పారు.