Allu Arjun-Sandeep Reddy Vanga Movie | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబోలో త్వరలోనే ఓ సినిమా పట్టాలెక్కనుంది. ఈ విషయాన్ని ధృవీకరించారు బాలీవుడ్ స్టార్ నిర్మాత, టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్. బార్డర్-2 మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన అల్లు-వంగా మూవీపై అప్డేట్ ఇచ్చారు. అల్లు అర్జున్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో గతంలోనే ఓ సినిమా ఖరారు అయ్యింది. కానీ ఇద్దరూ ఇతర ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడంతో అది ఆలస్యం అయ్యింది. మరోవైపు ఈ ప్రాజెక్టు ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఈ తరుణంలో స్పందించిన భూషణ్ కుమార్ టీ సిరీస్ బ్యానర్ పై వరుసగా మూడు సినిమాలు చేయనున్నట్లు చెప్పారు.
రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’, ఆ తర్వాత యానిమాల్ సీక్వెల్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ రెండూ సినిమాల తర్వాత అల్లు అర్జున్-సందీప్ వంగా సినిమా పట్టాలెక్కనుందని క్లారిటీ ఇచ్చారు. దింతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాలా సంవత్సరాల క్రితమే అల్లు అర్జున్ కు సందీప్ ఓ కథను చెప్పారు. కానీ వివిధ కారణాల మూలంగా అది ప్రారంభం కాలేదు. ‘అర్జున్ రెడ్డి’ లో అల్లు అర్జున్ ను అనుకున్నా అదీ వీలుపడలేదు. ఇకపోతే ప్రస్తుతం దర్శకులు అట్లీ, లోకేశ్ కనగరాజన్ తో అల్లు అర్జున్ సినిమాలు చేస్తున్నారు.









