Allu Arjun Met Sri Tej In KIMS | నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun )మంగళవారం సికింద్రాబాద్ లోని కిమ్స్ దవాఖానకు వెళ్లారు.
డిసెంబర్ నాలుగున సంధ్య థియేటర్ ( Sandhya Theater )వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ క్రమంలో ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
అయితే ఈ ఘటనపై కేసు నమోదైన క్రమంలో బాలుడి పరామర్శకు వెళ్ళొద్దన్ని లీగల్ టీం ( Legal Team ) చెప్పడంతో తాను ఆసుపత్రికి వెళ్ళలేదని అల్లు అర్జున్ గతంలోనే చెప్పారు. తాజగా పోలీసులకు సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు చేరుకున్నారు.
తెలంగాణ ఎఫ్డీసీ ఛైర్మన్ ( FDC Chairman ) దిల్ రాజుతో కలిసి లోపలికి వెళ్లారు. సుమారు 20 నిమిషాలు ఆసుపత్రిలో ఉన్న అల్లు అర్జున్ శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని, చికిత్స వివరాలను వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీతేజ్ తండ్రి భాస్కర్ తో మాట్లాడి భరోసా ఇచ్చారు. అల్లు అర్జున్ రాకతో ఆసుపత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.