Allu Arjun Arrest News | సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నాంపల్లి కోర్టు నటుడు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది.
అంతేకంటే ముందు నాంపల్లి కోర్టులో ఈ కేసుకు సంబంధించి వాడివేడిగా వాదనలు జరిగాయి. పుష్ప-2 బెనిఫిట్ షోను వీక్షించేందుకు అల్లు అర్జున్, నటి రష్మిక తదితరులు వస్తారని ఈ మేరకు పోలీసుల నుండి ముందుగానే అనుమతి తీసుకున్నట్లు అల్లు అర్జున్ తరఫు న్యాయవాది చెప్పారు.
అయితే షోకు అనుమతి తీసుకున్నా థియేటర్ కు వచ్చే సమయంలో అల్లు అర్జున్ రోడ్డుపై భారీ ర్యాలీ ద్వారా థియేటర్ కు వచ్చారని, ఈ క్రమంలోనే తొక్కిసలాట జరిగినట్లు ప్రభుత్వ తరఫు పేర్కొన్నారు.
అల్లు అర్జున్ కు ఎంతటి క్రేజ్ ఉందొ అతనికి కూడా తెలుసునని అయినప్పటికీ అల్లు అర్జున్ ఉద్దేశ్యపూర్వకంగా ర్యాలీ నడుమ థియేటర్ కు వచ్చినట్లు పీపీ వాదించారు.