Akbaruddin Owaisi Sensational Comments On Allu Arjun | నటుడు అల్లు అర్జున్ ( Allu Arjun ) పై సంచలన ఆరోపణలు చేశారు చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ( Akbaruddin Owaisi ).
తెలంగాణ అసెంబ్లీలో శనివారం సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై చర్చ జరిగింది. ఈ ఘటనపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని అక్బరుద్దీన్ కోరారు. ఇదే సమయంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనకు కొద్దిగా సమాచారం ఉందన్నారు.
అల్లు అర్జున్ సినిమా చూడడానికి వచ్చిన సమయంలో థియేటర్ వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. పోలీసులు వచ్చి బయట తొక్కిసలాట జరిగిందని, ఇందులో ఒక మహిళ మృతి చెందగా, బాలుడు గాయపడినట్లు అల్లు అర్జున్ కు చెప్పారని కానీ అల్లు అర్జున్ మాత్రం నవ్వుతూ మహిళ చనిపోయిందంటే మన సినిమా హిట్ అయినట్లే అంటూ బదులిచ్చారని ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే ఓ వైపు మహిళ చనిపోతే నటుడు మాత్రం కారు రూఫ్ టాప్ పైకి ఎక్కి చేతులు ఊపుతూ వెళ్లారని మండిపడ్డారు.










