Akbaruddin Owaisi News | చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే, ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్డి అధికారంలో ఉన్నా రావు అధికారంలో ఉన్నా తాము ఎవరి వెనుకాల పరిగెత్తం అని వారే తమ వెనుక వస్తారని హాట్ కామెంట్స్ చేశారు.
ఎవరు అధికారంలో ఉన్నా పని చేపించుకోవడం తమకు తెలుసన్నారు. ఈ నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. అంటే అధికారంలో ఏ పార్టీ ఉన్నా హైదరాబాద్ లో మరీ ముఖ్యంగా పాతబస్తీలో తమ పట్టు బలంగా ఉంటుందని ఒవైసీ సంకేతాలు ఇచ్చారని విశ్లేషణలు వస్తున్నాయి. ఇకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కిన నేపథ్యంలో ఒవైసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ యాదవ్ కు ఎంఐఎం మద్దతు ప్రకటించిన విషయం తెల్సిందే. ఈ మేరకు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ గతంలోనే ప్రకటించారు.









