Vishwaksen Key Decision | టాలీవుడ్ (Tollywood) యంగ్ హీరో విష్వక్ సేన్ (Vishwaksen) నటించిన తాజా చిత్రం ‘లైలా’ (Laila). వాలెంటైన్స్ డే (Valentines Day) సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టింది.
ఫస్ట్ డే నుంచే లైలా నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సినిమాలో అసభ్యకరమైన డైలాగ్స్, అభ్యంతరకమైన సీన్స్ ఉన్నాయని సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా ఫెయిల్యూర్ ను అంగీకరిస్తూ విశ్వక్ తాజాగా ఓ కీలక ప్రకటన చేశారు.
”ఇటీవల తన సినిమాలు అందరూ కోరుకున్న స్థాయికి చేరుకోలేకపోయాయని పేర్కొన్నారు. లైలా సినిమాపై వచ్చిన విమర్శలను అంగీకరిస్తున్నాను. నన్ను నమ్మి, నా ప్రయాణాన్ని మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ.. నా అభిమానులకు హృదయపూర్వక క్షమాపణలు.
నేను ఒక చెడు సినిమా తీస్తే, నన్ను విమర్శించే హక్కు పూర్తిగా మీకు ఉంది. ఇక పై, నా ప్రతి సినిమా క్లాస్ లేదా మాస్ అయినా సరే, అసభ్యత ఉండదు. ఇక పై కేవలం సినిమా మాత్రమే కాదు, నా ప్రతి సన్నివేశం కూడా మీ మనసుకు తగిలేలా ఉండాలని నిర్ణయించుకున్నాను.
అంతే కాకుండా, నా మీద విశ్వాసం ఉంచిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను” అని తన ప్రకటనలో పేర్కొన్నారు విష్వక్సేన్.